భయపెడుతున్న ‘ఆవిరి’ ట్రైలర్‌


తెలుగులో వినూత్న చిత్రాల దర్శకుల్లో రవిబాబు ఒకరు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రాలు తెరకెక్కించటంలో ముందు వరసలో ఉంటారాయన. ఆయన నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఆవిరి’. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఇది చూస్తుంటే.. ‘అవును’, ‘అవును 2’ చిత్రాల లాగే మరోసారి ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. దెయ్యం నేపథ్యంగా వచ్చిన సన్నివేశాలు ఉత్కంఠ రేపుతాయి. ట్రైలర్‌లో ఓ పాప ఎవరీ అంతుపట్టని విధంగా ప్రవరిస్తుంటుంది. తనకు ఏమైందో తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు తల్లిదండ్రులు. చివర్లో ఫ్రిజ్‌లో దాక్కుని ఉండగా.. డోర్‌ తెరవగానే భయభ్రాంతులకు గురిచేసే సన్నివేశం హైలెట్‌గా నిలిచింది. నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. ఇంతకీ ఆ పాప అలా ప్రవర్తించడానికి కారణమేంటో తెలియాలంటే నవంబరు 1 వరకు వేచి చూడాల్సిందే.

                                       


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.