బట్టతల బాధతో నవ్విస్తున్న ‘బాలా’

బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా నటించిన చిత్రం ‘బాలా’. అమర్‌ కౌశిక్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ ఇటీవలే విడుదలైంది. ఇందులో ఆయుష్మాన్‌ యవ్వనంలోనే బట్టతల సమస్యతో బాధపడుతుంటాడు. పరిష్కారానికి రకరకాల మందులు వాడినా ఫలితం ఉండదు. ఈ ప్రయత్నంలో ఆయన హావభావాలు నవ్వుల్ని పూయిస్తాయి. ఆ సమస్యతో ఆయన ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? పరిష్కారం మార్గం ఏంటి? అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ఇప్పటికే టీజర్‌ సినిమాపై ఆసక్తి పెంచగా ట్రైలర్‌ అంతకు మించి కామెడీ పండించింది. యామి గౌతమ్, భూమి ఫెడ్నేకర్‌ కథానాయికలు. మడోక్‌ ఫిల్మ్స్‌ - జియో స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి దినేష్‌ విజ్జన్‌ నిర్మాత. నవంబర్‌ 7 న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

                         


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.