అలరిస్తున్న ఎన్బీకే చిత్రం యానిమేట్‌డ్‌ టీజర్‌!

‘సింహా’ నటుడు నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన 106వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి బాలకృష్ణ పుట్టినరోజు (జూన్‌ 10) సందర్భంగా విడుదల చేసిన టీజర్‌ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన యానిమేటెడ్‌ టీజర్‌ ఒకటి విడుదలైంది. ఎస్‌.ఆర్‌.ఎ1 ఎంటర్‌టైన్‌మెంట్‌ రూపొందించిన టీజర్‌ బాలయ్య అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులో ‘అందాల రాక్షసి’ నటుడు నవీన్‌చంద్ర కీలక పాత్రల్లో నటించనున్నాడట. ఇప్పటికే చిత్రంలో శ్రీకాంత్‌ కూడా ఓ పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.