ఆసక్తి పెంచుతున్న ‘బ్యూటిఫుల్‌’ ట్రైలర్‌

నూతన నటీనటులు సూరి, నయనలతో దర్శకుడు అగస్త్య తెరకెక్కిస్తున్న చిత్రం ‘బ్యూటిఫుల్‌’. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ కలల ప్రాజెక్టుగా రూపొందుతుంది. ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన నాటి ‘రంగీల’ చిత్ర స్ఫూర్తిగా వస్తోంది. తాజాగా ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. మూడు నిమిషాల వ్యవధి ఉండే ఈ ట్రైలర్‌లో మాటలు ఉండవు. కేవలం నేపథ్య సంగీతంతోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. నాయకానాయికలు ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని డబ్బు కారణంగా విడిపోయారనే అంశం చూపించారు. ప్రేమికుల మధ్య అలా ఎందుకు జరిగిందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. టైగర్‌ కంపెనీ పొడ్రక్షన్‌ పతాకంపై టి.నరేష్‌ కుమార్, టి. శ్రీధర్‌ సంయ³క్తంగా నిర్మిస్తున్నారు. షేక్‌ యూసఫ్‌ సహ నిర్మాత. సంగీతం రవి శంకర్‌. శరవేగంగా చిత్రీకరణ పూర్తిచేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.