అలరిస్తోన్న బెల్‌ బాటమ్‌ టీజర్‌

వైవిధ్య నటుడు యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్ హీరో నటిస్తున్న చిత్రం ‘బెల్‌ బాటమ్’‌. రంజిత్‌ ఎం.తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వాణీకపూర్‌ కథానాయికగా నటిస్తోంది. స్పై థ్ర్లిల్లర్‌గా 1980ల నాటి నేపథ్యంలో వస్తోన్న ఇందులో లారా దత్తా భూపతి, హుమా ఖురేషి కూడా ఓ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్షయ్‌ ఇందులో రా ఏజెంట్‌ పాత్రలో నటిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన టీజర్‌ ఒకటి విడుదలై ఆకట్టుకుంటోంది. ఆసీమ్‌ అరోరా, పర్వేజ్‌ షేక్‌ రాసిన కథ ఆధారంగా చిత్రాన్ని విష్ణు భగ్నానీ, పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్త సమర్పణలో నిర్మిస్తున్నారు. మోనిషా అడ్వాణి, మధు బోజ్వానీ, నిఖిల్‌ అడ్వాణిలు నిర్మాతలు. స్కాట్‌ల్యాండ్‌లోని హైల్యాండ్‌ ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తి చేసుకుంది. తనీష్‌ బాగ్చీ సంగీత స్వరాలు సమకూర్చగా, రాజీవ్‌ రవి కెమెరామెన్‌గా వ్యవహరించారు. చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొన్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.