‘భీష్మ’లో తొలగించిన సీన్‌ ఇదే

నితిన్, రష్మిక జంటగా తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. ‘సింగిల్‌ ఫర్‌ ఎవర్‌’ ఉపశీర్షిక. వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. సామాజిక మాధ్యమాల వేదికగా ఈ సినిమాలోని డిలేటెడ్‌ సన్నివేశాన్ని అభిమానులతో పంచుకుంది చిత్ర బృందం. వ్యవసాయ క్షేత్రంలో రైతులతో మాట్లాడే రష్మిక పక్కన ఇద్దరు చిన్నారుల మాటలు విని వాళ్లకు దగ్గరకు వెళ్తుంది. ఆ పిల్లల సమస్య తెలుసునే ప్రయత్నంలో నితిన్‌ రష్మికను చూస్తాడు. నాయికానాయకుల ఆలోచనలు ఒకటైన నేపథ్యంలో ‘నా కలలే నీ రూపంలో ఎదురయ్యే నిజమా మాయ’ అనే గీతం వినిపిస్తుంది. సినిమా నిడివి ఎక్కువ అవడంతో ఈ సన్నివేశం తొలగించారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో అలరిస్తుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.