అదరగొడుతున్న ‘దుర్గామతి’ ట్రైలర్‌

భూమి పెడ్నేకర్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘దుర్గావతి’.ఇటీవలేఈ సినిమా టైటిల్‌ను ‘దుర్గామతి’గా మార్చింది చిత్రబృందం. తాజాగా చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ అదరగొడుతుంది. భూమి నటన విపరీతంగా ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలుస్తుంది.తెలుగులో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘భాగమతి’కి హిందీ రీమేక్‌ ఇది. మాతృకను తెరకెక్కించిన అశోక్‌ హిందీ చిత్రానికీ దర్శకత్వం వహించారు. ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’ తర్వాత అక్షయ్‌ నిర్మించిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం డిసెంబరు 11న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా విడుదల కానుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.