జయం-అరవింద్‌ల ‘బోగన్‌’ చిత్ర తొలి గీతం సింధూర విడుదల

అందాల నటుడు అరవింద్‌ స్వామి, జయం రవిలు కలిసి నటించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం బోగన్‌. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో తెలుగులోనూ వస్తోంది. లక్ష్మణ్‌ దర్శకత్వంలో తెరెకెక్కిన చిత్రానికి జయం రవి, అరవింద్‌ స్వామి, హన్సికా మోత్వానిలు నాయికానాయకులు. ఎస్‌.ఆర్‌.టి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ మధ్యే తెలుగు వెర్షన్‌లో విడుదలైన ట్రైలర్‌కి అనూహ్య స్పందిన దక్కిందని చిత్రనిర్మాణ సంస్థ తెలిపింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సింధూర అంటూ సాగే ఓ ఆడియో సాంగ్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ..మా నిర్మాణ సంస్జ నుంచి బోగన్‌ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాం అని ప్రకటన వచ్చినప్పటి నుంచి ప్రేక్షకులతో పాటు చిత్రసీమలోనూ మంచి స్పందన లభిస్తోంది. ఇప్పుడు విడుదలైన సింధూర పాట కూడా అలరిస్తుంది నమ్ముతు త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని అన్నారు. భువనచంద్ర చేతిలో నుంచి జాలువారిన సాహిత్యానికి సమీర్‌ భరద్వాజ్‌ గొంతు సవరించగా, డి.ఇమ్మాన్ సంగీత స్వరాలు అందించారు. ఇంకా చిత్రంలో నాజ‌ర్‌, పొన్‌వ‌ణ్ణ‌న్‌, న‌రేన్‌, అక్ష‌ర గౌడ తదితరులు నటించారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.