‘బుర్రకథ’ ట్రైలర్‌


ఆది సాయికుమార్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘బుర్రకథ’. డైమండ్‌ రత్న బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌  సోమవారం చిత్రబృందం విడుదల చేసింది. ఆ ట్రైలర్‌లో ..‘'రామాయణంలో రాముడికి శత్రువు రావణాసురుడు. కృష్ణుడి శత్రువు కంసుడు. కానీ, నా శత్రువు నాతోనే ఉన్నాడు'’ అంటూ ఆది చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభం అవుతుంది.  ఇందులో ఆది  సాయికుమార్ అభి, రామ్‌ అనే రెండు పాత్రల్లో పాత్రల్లో కనిపిస్తారు. 
అభి అల్లరి కుర్రాడిలా ఉంటాడు. కానీ, రామ్‌ చాలా అమాయకుడు. భక్తి, సన్యాసం వంటివి నమ్మే వ్యక్తిగా కనిపించారు. ట్రైలర్‌ చివర్లో హాస్యనటుడు ‘30 ఇయర్స్‌’ పృథ్వీ.. ‘సాహో’ సినిమాలో ప్రభాస్‌ చెప్పిన ‘ఫ్యాన్స్‌, డైహార్డ్‌ ఫ్యాన్స్‌’ డైలాగ్‌ చెప్పడం హైలైట్‌గా నిలుస్తుంది. జూన్‌ 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 







Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.