ఆసక్తిరేకెత్తిస్తోన్న ‘చాణక్య’ టీజర్‌..

యాక్షన్‌ చిత్రాలకు పెట్టింది పేరు గోపిచంద్‌. ఆయన చేసిన ‘లక్ష్యం’, ‘రణం’, ‘సాక్ష్యం’, ‘జిల్‌’ వంటి సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి విజయాలు అందుకున్నాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ యువ హీరో తిరు దర్శకత్వంలో ‘చాణక్య’ పేరుతో ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ విడుదలైంది. ఈ ప్రచార చిత్రాన్ని బట్టీ చూస్తుంటే గోపీచంద్‌ భారత్‌ తరపున పనిచేసే రా ఏజెంట్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. రెండు భిన్నమైన లుక్స్‌లోనూ దర్శనమిస్తున్నాడు. ఓ రహస్య ఆపరేషన్‌ నిమిత్తం పాకిస్థాన్‌ దేశస్థుడిలా పాక్‌లో నివసిస్తూ ఆ దేశ రహస్యాలను భారత్‌కు చేరవేస్తుంటాడు. ఈలోగా తను భారత్‌ ఏజెంట్‌ అని అక్కడి అధికారులకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారి నుంచి గోపీచంద్‌ ఎలా తప్పించుకొని బయటపడ్డాడు. అతను చేపట్టిన రహస్య ఆపరేషన్‌ వెనుక లక్ష్యమేంటి? తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా? లేదా? అన్నది చిత్ర కథగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. టీజర్‌లో చూపించిన యాక్షన్‌ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.