ఆసక్తి పెంచుతున్న ‘ఛపాక్‌’ ట్రైలర్‌
యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితాధారంగా ‘ఛపాక్‌’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె లక్ష్మీ పాత్రలో నటిస్తుంది. మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల చేసింది చిత్ర బృందం. న్యాయం కావాలని కోరుతూ ప్రజలు నినాదం చేసే సన్నివేశంతో ప్రారంభమయ్యే ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇందులో దీపికా.. లక్ష్మీ అగర్వాల్‌గా ఒదిగిపోయింది. నేపథ్య సంగీతం అలరిస్తుంది. ఎందుకు ఆమెపై యాసిడ్‌ దాడి జరిగింది? ఈ సంఘటన తర్వాత ఆమెలో వచ్చిన మార్పు ఏంటి? తెలుసుకోవాలంటే 2020 జనవరి 10 వరకు ఆగాల్సిందే. ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ పతాకంపై నిర్మితమవుతుందీ చిత్రం.
  
                              


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.