వర్మ కరోనావైరస్‌ చిత్రం ట్రైలర్‌ చూశారా!

ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఏం చేసినా ఓ వైవిధ్యం కనిపిస్తోంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు అందరు ఇంట్లోనే ఉన్నారు. కానీ రామ్‌గోపాల్‌ వర్మ మాత్రం కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) నేపథ్యంలో ‘కరోనావైరస్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. అంతేకాదు ఆ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ని సైతం విడుదల చేశారు. ఇంతకీ ఆ చిత్రం ట్రైలర్లో ఏముందంటే.. ఇంట్లోని ఓ అమ్మాయి జలుబు, దగ్గుతో బాధపడుతూ ఉంటుంది. అయితే సొంత తోడబుట్టినవారే అమ్మాయి పక్కనే కూర్చోవడానికి జంకుతుంటారు. మొత్తం మీద ఎలాంటి విపత్తులోనైనా సినిమా చేయగలిగే సత్తా ఒక్క రామ్‌గోపాల్‌ వర్మకే చెందిదని పలువురు సినీ అభిమానులు అనుకుంటున్నారు. అగస్యా మంజు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డిఎస్‌ఆర్‌ సంగీతం అందిచారు. అయితే చిత్రాన్ని థియేటర్లో విడుదల చేస్తారో లేక కొత్తగా వచ్చిన ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారే తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ సినిమా ట్రైలర్‌పై బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్‌ బచ్చన్‌ సైతం ప్రసంశలు కురిపించాడు. 

 


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.