అదరగొడుతున్న ‘క్రాక్‌’ టీజర్‌

వితేజ కథానాయకుడుగా మలినేని గోపీచంద్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘క్రాక్‌’. శ్రుతిహాసన్‌ నాయిక. బి.మధు నిర్మాత. తాజాగా ఈ చిత్ర టీజర్‌ విడుదల చేసింది చిత్రబృందం. ‘ఒంగోలులో రాత్రి గం.8లకు కరెంటు పోయిందంటే కచ్చితంగా మర్డరే’ అంటూ సాగే ఈ టీజర్‌ ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఓరేయ్‌ అబ్బిగా, సుబ్బిగా నువ్వు ఎవడైతే నాకేంట్రా అని రవితేజ చెప్పే డైలాగ్‌ అలరిస్తుంది. పూర్తి యాక్షన్‌ హంగులతో రూపొందిన టీజర్‌ అదరగొడుతుంది. తమన్‌ నేపథ్య సంగీతం ప్రధానంగా నిలుస్తుంది. తమిళ నటులు వరలక్ష్మి శరత్‌ కుమార్, సముద్ర ఖని నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మే 8న విడుదల కానుందీ చిత్రం.

                       


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.