అలరిస్తున్న ‘డియర్‌ కామ్రేడ్‌’ లిరికల్‌ సాంగ్‌
                                   

భరత్‌ కమ్మ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న నటిస్తున్న చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. ఈ చిత్రానికి సంబంధించిన లిరికల్‌ వీడియో సాంగ్‌ ఒకటి విడుదలైంది. ‘‘కడలల్లె వేచే కనులే.. కదిలేను నదిలా కలలే.. ఒడి చేరి ఒకటైపోయే..తీరం కోరే ప్రాయం..అంటూ సాగే లిరికల్‌ పాట అందరిని ఆకట్టుకునేలా ఉంది. రెహ్మన్‌ కలం నుంచి జాలువారిన ఈ పాటకు సిద్ద్‌ శ్రీరామ్, ఐశ్వర్య రవిచంద్రన్‌ ఆలపించగా, జస్టీన్‌ ప్రభాకరన్‌ సంగీతీ దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్, మోహన్‌ చెరుకూరి నిర్మాతలు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.