అదరగొడుతున్న ‘ధనుష్‌ 40’ ఫస్ట్‌లుక్‌

మిళ నటుడు ధనుష్‌తో దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజ్‌ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. తెలుగులో ‘జగమే తంత్రం’ పేరుతో విడుదల కానుంది. ఐశ్వర్య లక్ష్మి నాయిక. తాజాగా ఫస్ట్‌లుక్, మోషన్‌ పోస్టర్‌ విడుదల చేసింది చిత్ర బృందం. దీనికి సంబంధించి రూపొందించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. పాత్రల్ని పరిచయం చేస్తూ, సాంకేతిక వర్గ వివరాలు తెలియజేసే విధానం ఆకట్టుకుంటుంది. ధనుష్‌ రెండు విభిన్న పాత్రల్లో అదరగొడుతున్నాడు. ఓ పాత్రలో తెల్లని దుస్తులు ధరించి తుపాకి పేలుస్తుంటాడు ధనుష్‌. ఇందులో మాస్‌గా, మరోచోట క్లాస్‌గా దర్శనమిచ్చి అంచనాలు పెంచుతున్నాడు. సంతోష్‌ నారయణ్‌ అందించిన నేపథ్య సంగీతం ప్రధానంగా నిలుస్తుంది. వై నాట్‌ స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.