‘అసురన్‌’ విశ్వరూపం చూశారా!

మిళ స్టార్‌ హీరో ధనుష్‌ నటిస్తున్న చిత్రం ‘అసురన్‌’. వెట్రి మారన్‌ దర్శకుడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో ధనుష్‌ నట విశ్వరూపం చూపించాడు. రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు ధనుష్‌. యాక్షన్‌ నేపథ్యంలో రూపొందించిన ఈ ట్రైలర్‌ ఆద్యంతం అలరిస్తుంది. పోరాట సన్నివేశాలు అధికంగా ఉన్న ఈ చిత్రానికి ప్రముఖ ఫైట్‌ మాస్టర్‌ పీటర్‌ హెయిన్‌ స్టంట్స్‌ తెరకెక్కించారు. వి. క్రియేషన్స్‌ పతాకంపై కలైపులి ఎస్‌ థాను నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబరు 4న విడుదల కానుంది. సంగీతం జి.వి. ప్రకాశ్‌ కుమార్‌.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.