అలరిస్తున్న ‘డిస్కోరాజా’ టీజర్‌

‘సైనికులు సంవత్సరాల పాటు బాంబింగ్స్‌తోనూ, ఫైరింగ్స్‌తోనూ యుద్ధాలు చేసి రిటైర్‌ అయి ఇంట్లో ఉంటే సడెన్‌గా వచ్చే సైలెన్స్‌ ఉంటది చూడు.. అది అప్పటి దాక వాళ్లు చూసిన వైలెన్స్‌ కంటే భయంకరంగా ఉంటుంది’. ఆ సైలెన్స్‌ మాస్‌ మహారాజా రవితేజ అనిపిస్తుంది సంభాషణ చూస్తుంటే. రవితేజ కథానాయకుడుగా దర్శకుడు వి.ఐ.ఆనంద్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘డిస్కోరాజా’. పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేష్‌ కథానాయికలు. తాజాగా ‘డిస్కోరాజా టీజర్‌ 2.ఓ’ పేరుతో రెండో టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ‘పోస్ట్‌ వార్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ తెలుసా?’ అంటూ మొదలయ్యే ఈ టీజర్‌ ఆద్యంతం అసక్తిరేకెత్తిస్తుంది. ఇబ్బందుల్లో ఉన్న అన్నయ్య గురించి ఓ తమ్ముడు దీనికి మందేంటి డాక్టర్‌ అని అడగ్గా.. మీ అన్నయ్య లైఫ్‌లో ఓ కొత్త ఛాలెంజ్‌ కావాలి అని సమాధానం ఇస్తాడు. ఈ డైలాగ్‌ పూర్తవగానే డిస్కోరాజా దర్శనమివ్వడం టీజర్‌కే హైలెట్‌గా నిలుస్తుంది. ‘రంపంపం’ అంటూ హీరో ఎలివేషన్‌కు తగ్గట్లు తమన్‌ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఎస్‌ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.