మీరు నా ‘దొరసాని’

నంద్‌ దేవరకొండ, రాజశేఖర్‌ చిన్న కుమార్తె శివాత్మికలను నాయకానాయికలుగా పరిచయం చేస్తూ నూతన దర్శకుడు కేవీఆర్‌ మహేంద్ర తెరకెక్కించిన చిత్రం ‘దొరసాని’. బిగ్‌బెన్‌ సినిమాస్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ‘దొరసానులు గదుల్లో నుంచి బయటికి వస్తారా రా..’ అంటూ నలుగురు యువకులు.. దేవకి (శివాత్మిక)ను చూసి మాట్లాడుకుంటున్న సంభాషణతో టీజర్‌ మొదలైంది. రాజు (ఆనంద్‌).. దేవకిని ఇష్టపడటం, ఈ విషయం తెలిసి ఊరి పెద్దలు రాజుని చావగొట్టిన సన్నివేశాలతో టీజర్‌ను ఉత్కంఠభరితంగా చూపించారు. నాయకానాయికలిద్దరూ కొత్తవారే అయినప్పటికీ వారు పండించిన భావోద్వేగాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. దొరసాని పాత్రలో శివాత్మిక ఎంతో హుందాగా, అందంగా కనిపించింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.