భయపెడుతున్న మమతా ‘ఫోరెన్సిక్’

‘యమదొంగ’ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన సందడి చేసిన అందాల భామ మమతా మోహన్‌దాస్‌. మలయాళంలో ది సైన్స్‌ ఆఫ్‌ ఎ క్రైమ్‌’ క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఫోరెన్సిక్’‌. చిత్రంలో ప్రధాన పాత్రలో మమతా మోహన్‌దాస్‌ నటించింది. ఈ మలయాళ సినిమాకి అఖిల్‌ పాల్, అనాస్‌ ఖాన్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. టివినో థామస్, ప్రతాప్‌ పోతన్, శ్రీకాంత్‌ మురళీ, రెబా మోనికా నటించారు. సెన్సార్‌ బోర్డు నుంచి ‘ఎ’ సర్టిఫికేట్‌ అందుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 28న విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా డిజిటల్‌ ప్రీమియర్‌గా జులై 31న విడుదల కానుంది. ఇందులో మమతా మోహన్‌దాస్‌ ఐపీఎస్‌ అధికారి రితికా జేవియర్‌గా నటిస్తోంది. తెలుగులో విడుదలైన ట్రైలర్‌ పలువురిని ఆకట్టుకుంటోంది. జువిస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మితమైన చిత్రానికి నవీస్‌ ఎక్సేవియర్, సిజ్జు మ్యథ్యూలు నిర్మాతలుగా వ్యవహరించారు. చిత్ర ట్రైలర్లో కిల్లర్ ఇంకా ఎందుకు స్వేచ్ఛగా నడుస్తున్నాడు? అడవుల్లో ఉన్న చీకటి రహస్యాన్ని శామ్యూల్ కనుగొంటారా? అతను ఏమి కనుగొన్నాడు అనేది చిత్ర కథ. చిత్రానికి ఎడిటర్‌గా షమీర్ ముహమ్మద్, జేక్స్ బిజోయ్ సంగీత స్వరాలు అందించారు.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.