
ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఫ్రెండ్ షిష్’. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదలైంది. ఈరోజు అంతర్జాతీయ ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ టీజర్ వీడియోని చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదలై అందరిని ఆకట్టుకుంటోంది. జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్య సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ బిగ్‌బాస్ ఫేం లోస్లియాలు నటిస్తున్నారు. ఇప్పటికే హర్భజన్ సింగ్ ట్విట్టర్లో షేర్ చేసిన సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, టీమ్ ఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ 'ఫ్రెండ్ షిప్ చిత్రంపై స్పందస్తూ..ద వెరీ బెస్ట్ భజ్జీ.. పోస్టర్ చూశాను చాలా బాగుంది. నువ్వు కొట్టే సిక్సులు లాగే సినిమా కూడా తప్పకుండా విజయవంతం అవుతుందని గతంలో ట్వీట్ చేశారు. చిత్రంపై క్రికెటర్లతో పాటు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. సీన్‌టొ స్టూడియోస్, సినీ మాస్ స్టూడియోస్ పతాకాలపై నిర్మితమౌతున్న చిత్రాన్ని జెపిఆర్ & స్టాలిన్ నిర్మాతలుగా వ్యవరిస్తున్నారు. డి.ఎం.ఉదయ్ కుమార్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ, ఇంగ్లీష్ భాషల్లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.