తాత పాటకి మనవడి డ్యాన్స్

అశోక్‌ గల్లా, నిధి అగర్వాల్‌ జంటగా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. జీబ్రాన్‌ స్వరాలందిస్తున్నారు. ఆదివారం కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకోని ఈ చిత్రం నుంచి ఓ వీడియో గీతాన్ని విడుదల చేశారు. ఇది ‘యమలీల’ చిత్రంలో కృష్ణ ఆడిపాడిన ‘జుంబారే.. జుజుంబరే’ గీతానికి రీమీక్స్‌. ఈ పాట గురించి చిత్ర బృందం స్పందిస్తూ.. ‘‘ఈ గీతంతో సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కు మా బృందం మంచి కానుక ఇచ్చినట్లయింది. ఈ పాటలో తన లెజండరీ తాతయ్య కృష్ణను అశోక్‌ గల్లా అనుకరించిన విధానం ఆకట్టుకుంటుంది. కాస్ట్యూమ్స్, సెట్స్‌.. పాటకు సరిగ్గా సరిపోయాయి. నిధి అగర్వాల్‌ ఈ గీతానికి మరో ప్రత్యేక ఆకర్షణ. ఈ సినిమా ఇప్పటి వరకు 50శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంద’’ని తెలిపింది. జగపతిబాబు, నరేష్, సత్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కళ: ఎ.రామాంజనేయులు, కూర్పు: ప్రవీణ్‌ పూడి, ఛాయాగ్రహణం: రిచర్డ్‌ ప్రసాద్, సమీర్‌ రెడ్డి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.