‘రాధేశ్యామ్’‌ల ప్రేమయాత్ర చూద్దామా!


‘బాహుబలి’ నటుడు ప్రభాస్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్న రొమాంటిక్‌ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’‌. పూజాహెగ్డే కథానాయిక. ఈ సినిమాకి సంబంధించి కొత్త అంశాల కోసం ప్రభాస్‌ అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రభాస్‌ పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు అక్టోబర్ 23న బీట్స్ ఆఫ్‌ రాధేశ్యామ్‌ అనే ఓ మోషన్‌ పోస్టర్ని చిత్ర బృందం విడుదల చేసింది. ప్రస్తుతం మోషన్‌ పోస్టర్ ప్రభాస్‌ అభిమానులతో పాటు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటోంది. మోషన్‌ పోస్టర్లో ఓ దట్టమైన పచ్చని అడివిలో రైలుమార్గం. రైల్‌లో ప్రయాణించే విక్రమాదిత్య (ప్రభాస్‌ ప్రేరణ (పూజాహెగ్డే)లు ప్రేమ వ్యవహారంలో మునిగితేలుతూ ఆ రైలులో నుంచి ప్రకృతి ఆస్వాదిస్తూ సాగుతున్న ఆ ప్రేమికుల దృశ్యాలు చాలా అందంగా ఆకట్టుకుంటున్నాయి. యువీ క్రియేషన్స్ పతాకంపై గోపీకృష్ణ మూవీస్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి వంశీ కృష్ణారెడి్, ప్రమోద్‌ ఉప్పాలపాటి నిర్మాతలు. చిత్రంలో ‘ప్రేమపావురాలు’ నటి భాగ్యశ్రీ, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి పులికొండ, కునాల్ రాయ్ కపూర్, రిద్ది కుమార్, సాషా చెత్రి, సత్యన్ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఇటలీలో జరుపుకుంటోంది. చిత్రానికి జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలోనే విడుదల చేయనున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.