‘హలో గురు ప్రేమ కోసమే’ ట్రైలర్‌ వచ్చేసింది!
రామ్‌ ఎప్పుడు విభిన్నంగానే కనిపిస్తుంటాడు. అలాంటి విభన్నమైన కథాంశంతో వస్తున్న చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. అనుపమ పరమేశ్వరన్, ప్రణీత కథానాయికలుగా, నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో వస్తున్న ఈచిత్ర ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. చిత్రం ట్రైలర్‌లో పోసాని ఎవరోనో తిడుతుంటే, సితార పోసానికి కొట్టడానికి వెళ్లాడని సమాధానం చెబుతుంది. మరో పక్క హీరో రామ్‌ చెప్పిన డైలాగ్‌ ‘స్కూలైన, కాలేజైనా, ఆఫీసుకైనా జాయిన్‌ అయిన తొలిరోజు చేసే పని ఏంటో తెలుసా? అంటూ కొచ్చన్‌ చెయ్యడం. ప్రకాష్‌రాజ్, రామ్‌ స్నేహితుడి పాత్రలో నటిస్తున్నారు. రామ్‌ ల్యాప్‌టాప్‌లో పనిచేసుకుంటుండగా.. ప్రకాష్‌రాజ్‌ ‘ఏం చేస్తున్నావ్‌ అక్కడా..? అంటే రామ్‌


‘సైట్‌ కొడుతున్నా..ఫ్రెండూ అంటూ చెప్పడం చాలా ఫన్నిగా అనిపిస్తుంది. ఇక కాఫీ షాపులో అనుపమ, రామ్‌లు మాట్లాడుకుంటూ అనుపమ అడుగుతుంది..‘పెళ్లి అయిన తరువాత అమ్మాయి జీవితం అమ్మ అవ్వడం వల్ల బాగుంటుంది. పెళ్లికి ముందు అమ్మాయి జీవితం నాన్న ఉండడం వల్ల బాగుంటుంది’దని చెబుతుంది. ఇందుకు సమాధానంగా రామ్‌.. ‘ఈ సోదంతా చెబితే వినటానికి బాగుంటుంది’ని పంచ్‌ వేస్తాడు. ఇలా పలు పాత్రలను పరియం చేస్తూ విడుదల చేసిన ట్రైలర్‌లో పలు అంశాలు బాగున్నాయి. ఇక చిత్రంలో సురేష్, శివకుమార్‌ తదితరులు నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.