
‘అ’ వంటి వైవిధ్యభరిత చిత్రం తర్వాత నేచురల్ స్టార్ నాని సొంత బ్యానర్ వాల్‌పోస్టర్ నుంచి రాబోతున్న కొత్త చిత్రం ‘హిట్’. ది ఫస్ట్ కేస్.. ఉపశీర్షిక. ‘ఫలక్‌నుమా దాస్’ వంటి హిట్ తర్వాత విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. నూతన దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించారు. రుహాని శర్మ కథానాయిక. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. విశ్వక్ ఇందులో విక్రమ్ అనే పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారు. ‘‘దిస్ జాబ్ విల్ డిస్ట్రాయూ విక్రమ్. యూ నీడ్ టు క్విట్ ది డిపార్ట్మెంట్’’ అనే సంభాషణలతో టీజర్ ఆసక్తికరంగా మొదలైంది. ‘‘డిపార్ట్మెంట్ను మాత్రం నేను వదల్లేను’’ అంటూ విశ్వక్ తన కర్తవ్యం ఏంటన్నది చెప్తాడు. మధ్యలో ఓ మిస్సింగ్ కేస్ స్టడీతో పాటు కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు చూపించారు. ఈ ప్రచార చిత్రాన్ని బట్టీ చూస్తే.. ఇదొక ఓ మిస్సింగ్ కేసు చుట్టూ అల్లుకున్న కథాంశంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి కనిపించకుండా పోయిన ఆ వ్యక్తి ఎవరు? విశ్వక్ ఆ కేసును ఎలా ఛేదించాడు? ఈ క్రమంలో అతనికెదురైన సవాü™్లంటి? వంటి ఆసక్తికరాంశాలతో దీన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 28న విడుదల కానుంది.