గతంలో జరిగిన సంఘటనే మళ్లీ ఎదురైతే?

ఓ ఘటనలో ప్రేమించిన వారిని కోల్పోయిన వ్యక్తి మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేస్తాడు? ఈ ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమే ‘హిట్‌’. విశ్వక్‌ సేన్‌ కథానాయకుడుగా వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై నాని నిర్మిస్తున్నాడు. శైలేష్‌ కొలను దర్శకుడు. ఇందులో పోలీసు అధికారి విక్రమ్‌ రుద్రరాజు పాత్రలో నటిస్తున్నాడు విశ్వక్‌. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘ఓ సారి ఇలాగే జరిగినపుడు నువ్వు ప్రేమించిన వ్యక్తిని కోల్పోయావు. ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చింది ఏం చేస్తావ్‌’ అంటూ విశ్వక్‌ సేన్‌ను ఉద్దేశించి చెప్పే డైలాగ్‌తో మొదలవుతుంది ఈ వీడియో. యాక్షన్‌ సన్నివేశాలు ఆసక్తి రేపుతున్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. రహస్యాన్ని విశ్వక్‌ ఎలా చేధిస్తాడో తెలియాలంటే ఫిబ్రవరి 28 వరకు ఆగాల్సిందే. టీజర్‌ త్వరలోనే విడుదల కానుంది. రుహాని శర్మ కథానాయిక. సంగీతం: వివేక్‌ సాగర్‌.

                               


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.