రుద్రాక్ష, ధన్య ‘హల్‌చల్‌’ చేస్తున్నారు

ఉదయం లేస్తునే ‘హల్‌చల్‌’ తాగాడు రుద్రాక్ష. ఇంకేముంది ఎవరికి కనపడని వారు అతనికి కనిపిస్తున్నారు. అందులో ఒక అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయితో కలసి తెగ తిరుగుతున్నాడు..ఇంతలో 100 కోట్ల గొడవలో ఇరుకున్నాడు. మరి ‘హల్‌చల్‌’ తాగితే ఏమవుతుంది. తాగిన తరువాత ఏమయింది తెలియాలంటే రుద్రాక్ష ధన్య బాలక్రిష్ణన్‌ నటించిన ‘హల్‌చల్‌’ చూడాల్సిందే. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ‘అర్జున్‌ రెడ్డి’ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా విడుదల చేశాడు. హస్యం నేపథ్యంలో తెరకెక్కిన థ్రిల్లర్‌ సినిమా అని తెలుస్తుంది. ప్రచారచిత్రంలో ఎక్కువ శాతం హాస్యం, ఉత్కంఠ కనిపించాయి. డిసెంబర్‌ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది ‘హల్‌చల్‌’.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.