హంతకుడు అతనేనా?

ఆమె అందం, తెలివి గల ఒక ప్రముఖ వ్యాపార వేత్త. హత్యకు గురవుతుంది. పోలీసులు విచారణకు పిలిచినప్పుడు ఆమె భర్త ఏదో దాయటానికి ప్రయత్నిస్తున్నాడు. మరి హత్య చేసింది అతనేనా? కాదా? ఈ విషయం తెలియాలంటే ‘ది బాడి’ చిత్రం విడుదల వరకు ఎదురుచూడాల్సిందే. పోలీస్‌గా రిషి కపూర్‌ విచారణ చేస్తుంటే, ఇమ్రన్‌ హస్మి ఏదో దాయటానికి ప్రయత్నిస్తున్నట్లుగా ‘ది బాడి’ ప్రచార చిత్రంలో కనపడుతుంది. ఉత్కంఠభరితంగా సాగిన ట్రైలర్‌లో ఇమ్రాన్‌ హస్మి ముద్దులు కూడా ప్రధాన ఆకర్షణగా నలిచాయి. డిసెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. శోభిత ధూళిపాళ్ల కథానాయికగా నటిస్తోంది.


                             


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.