నందితా శ్వేతా ‘ఐపీసీ 376’ ట్రైలర్‌ చూశారా!

పవర్ కింగ్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ప్రభాకర్ సమర్పణలో హీరోయిన్ నందిత శ్వేతా ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం ‘IPC 376’. రాజ్ కుమార్ సుబ్రమన్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్ ను సంగీత దర్శకుడు థమన్ విడుదల చేశారు. ఒక బంగ్లాలో జరిగే అనూహ్య ఘటనలు పోలీసులకు సవాల్ విసురుతాయి. ఆధునిక యుగంలో సైన్స్ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుందంటూ చెబుతూనే, అటు అతీంద్రియ శక్తుల ఉనికిని విజువల్స్ లో చూపించారు. చిత్రం ట్రైలర్లో నందితా ..‘‘రేప్ చేస్తారు, ప్రాణాలతో తగలబెడతారు, అమ్మాయిలను బతకనివ్వరా అంటూ..’’నందిత శ్వేతా చెప్పిన ఎమోషనల్ పవర్ ఫుల్ డైలాగ్‌తో ఐపీసీ 376 ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్ లోని వివిధ ఇంట్రెస్టింగ్ షాట్స్ చిత్ర కథ గత థ్రిల్లర్ సినిమాలకు భిన్నమైన నేపథ్యంతో ఉందని అనుకుంటున్నారు. పోలీస్ అధికారి పాత్రలో నందిత శ్వేతా చాలా బాగా నటించిందని ట్రైలర్లో గమనించవచ్చు. యాదవ్ రామలిక్కమ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు సి.కళాధర్ సాహిత్యం అందిస్తున్నారు. తెలుగు, తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.