నాతో కిరికిరి వద్దంటున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’
                                 

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ నటటిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. హీరో రామ్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది. ‘‘పతా హై మై కౌన్‌ హూ..శంకర్‌..ఉస్తాద్‌ ఇస్మార్ట్‌ శంకర్‌’’ అంటూ రామ్‌ చెప్పే డైలాగ్‌లతో టీజర్‌ మొదలవుతుంది. టీజర్‌లోని సన్నివేశాన్ని చూస్తే మొత్తం పాతబస్తీ నేపథ్యంలో ఉంటుంది. రామ్‌ పలికిన ఇంకో డైలాగ్‌..‘‘నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడి ముంగట పొట్టేలును కట్టేసినట్లే..’’ అంటూ చెప్పిన ఈ డైలాగ్‌ టీజ్‌ర్‌కే హైలెట్‌గా నిలిచిందనని చెప్పవచ్చు. చిత్రంలో నిధి అగర్వాల్, నభా నటేష్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. జులై మాసంలోనే చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చేందు సన్నాహాలు చేస్తున్నారు.

                                       




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.