
తమిళ కథానాయకుడు ధనుష్ నటిస్తున్న చిత్రం ‘జగమే తంత్రం’. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలోని ‘‘ రకిట రకిట రకిట ఓ.. నేనెక్కడైనా ఎప్పుడైనా హ్యాపీగానే ఉంటా.. తోడుగా నా ప్రాణం ఉంది.. ఇంకేం కావాలంటా’’ అంటూ అనే లిరికల్ పాట విడుదలైంది. ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తోంది. భాస్కరభట్ల సాహిత్యానికి అనంతు, సంతోష్ నారాయణ్, సుషాల గొంతు శ్రావ్యంగా ఆలపించగా సంతోష్ నారాయణ్ సంగీతం అలరించింది. వై నాట్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కలైరసన్, జోజు జార్జ్ తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదలై ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకి వెంకట్ కాచర్ల డైలాగ్స్ అందిస్తున్నారు.