ఆకట్టుకుంటున్న ‘జాను’ ట్రైలర్‌
శర్వానంద్, సమంత జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘జాను’. తమిళంలో విజయవంతమైన ‘96’ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతుంది. సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకుడు. తాజాగా ట్రైలర్‌ విడుదలైంది. ‘ఎగిసి పడే కెరటాలను ఎదురు చూసే సముద్ర తీరాన్ని నేను.. పిల్లగాలి కోసం చూసే నల్ల మబ్బులా ఓర చూపు కోసం రాత్రంతా చుక్కలు లెక్కపెడుతుంది నా హృదయం’ అంటూ శర్వా చెప్పే కవితతో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. నాయికానాయకుల బాల్యం, యవ్వనం రెండింటిని చూపుతూ వాళ్ల ప్రేమను ఆవిష్కరించింది చిత్ర బృందం. శర్వా, సామ్‌ల హావభావాలు అలరిస్తున్నాయి. ‘ఒక్కోసారి జీవితంలో ఏం జరక్కపోయినా ఏదో జరగబోతుందని మనసుకు ముందే తెలిసిపోతుంద’ని సమంత చెప్పు డైలాగ్‌ మెప్పిస్తుంది. గోవింద్‌ వసంత అందించిన నేపథ్య సంగీతం ప్రధానంగా నిలుస్తుంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న ‘జాను’ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.