అలరిస్తున్న ‘కాదల్‌’ టీజర్‌

మరో ప్రేమ కథా చిత్రం సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. విశ్వంత్‌, చిత్ర శుక్ల జంటగా ‘కాదల్‌’ సినిమా రూపుదిద్దుకుంటుంది. కల్యాణ్‌ జీ గొంగన దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా శుక్రవారం చిత్ర టీజర్‌ విడుదలైంది. 2004లో జరిగిన ప్రేమ కథ ఇది. అందమైన అమ్మాయిని చూడగానే ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించే రొమాంటిక్ కుర్రాడి పాత్రలో కథానాయకుడు యశ్వంత్ కనిపించాడు. ఓ సందర్భంలో ‘నా వయసు నీకంటే ఎక్కువని బాధపడుతున్నావా’ అని నాయిక అంటే అబ్బే ఏజ్ గురించి ఏముంది ఊరికే మాట్లాడటానికి అని నాయకుడు సమాధానం ఇవ్వడం.. ఓ దుకాణంలో ‘ఆ అమ్మాయి నీకు కూడా అక్కేరా అంటూ తండ్రి కొడుకును కంట్రోల్ లో పెట్టేందుకు చెప్పే సంభాషణలు యువతను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలుస్తుంది. ఆశిష్ గాంధీ, రాకేందు మౌళి, దేవి ప్రసాద్, అన్నపూర్ణమ్మ, రాకెట్ రాఘవ,అప్పాజీ అంబరీష్, రూపా లక్ష్మి, డీజే దినేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కళ: ఆరె వెంకటేశ్వర్లు, సాహిత్యం: రాకేందు మౌళి.టఫ్ఎండ్ స్టూడియోస్ లిమిటెడ్ స్టూడియోస్ లిమిటెడ్ పతాకంపై కిరణ్ రెడ్డి మందాడినిర్మిస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.