భయపెడుతున్నఖామోషీ’’ ట్రైలర్‌

ప్రభుదేవా - తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖామోషి’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ఒకటి విడుదలైంది. ట్రైలర్లో...ఊరికి దూరంగా ఎక్కడో విసిరేసినట్లున్న ఓ పెద్ద బంగళా అది. అందులో ఓ యువతి ఒంటరిగా తిరుగుతోంది. ఆమెకు మాటలు వినిపించవు. మరోవైపు ఓ సైకో కిల్లర్‌ ఆమెను హత్య చేయడానికి ఆ బంగళాలోకి ప్రవేశిస్తాడు. ఇద్దరి మధ్య ఓ భయంకర నిశ్శబ్దం. ప్రాణం తీయాలని ఒకరు.. తప్పించుకోవాలని మరొకరు.. రసవత్తరంగా సాగుతోంది ఆ ఆట. మరి ఇందులో చివరికి గెలుపెవరిది? ఆ యువతి ప్రాణాలు కాపాడుకుందా? అన్నవి తెలియాలంటే ‘ఖామోషి’ వచ్చే వరకు ఆగాల్సిందే. ‘ఈనాడు’, ‘డేవిడ్‌ బిల్లా’ వంటి వైవిధ్యభరిత సినిమాలను తెరకెక్కించిన తెలుగువాడు చక్రి తోలేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఓ సరికొత్త హారర్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ మూవీని రూపొందించారు. ఇందులో తమన్నా చెవిటి యువతిగా కనిపించబోతుండగా.. ప్రభుదేవా సైకో కిల్లర్‌ పాత్రను పోషిస్తున్నారు. భూమిక ఓ కీలక పాత్రలో తళుక్కున్న మెరవబోతుంది. ట్రైలర్ చూస్తుంటే ఇదో థ్రిల్లంగ్ ఎమోషనల్‌ చిత్రంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

                         


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.