అలరిస్తున్న ‘పహిల్వాన్‌’ లిరికల్‌ సాంగ్‌

సుదీప్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పహిల్వాన్‌’. ఈ సినిమాకి సంబంధించిన ..‘కన్నమానియే.. అనే రిలికల్‌ సాంగ్‌ విడుదలైంది. వి.నాగేంద్ర ప్రసాద్‌ కలం నుంచి జాలు వారిన ఈ పాటకి సంజిత్‌ హేగ్డే గొంతు సవరించగా అర్జున్‌ జన్య సంగీతం అందించారు. ఎస్‌.కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సునీల్‌శెట్టి, ఆకాంక్షసింగ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈగ’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన సుదీప్‌ మల్లయోధుడి పాత్రలో సందడి చేయనున్నారు.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.