సుమంత్ కథానాయకుడిగా ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘కపటధారి’. నందితా శ్వేత కథానాయిక. నాజర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని మంగళవారం ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ట్రాఫిక్ ఎస్సై అయిన ఓ వ్యక్తి ఓ హత్య కేసును ఎలా ఛేదించాడన్న ఆసక్తికర కథాంశంతో ‘కపటధారి’ తెరకెక్కింది. ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ట్రాఫిక్ ఎస్సై అయిన సుమంత్ క్రైమ్ కేసును ఎందుకు టేకప్ చేయాల్సి వచ్చింది? చివరకు దాన్ని పరిష్కరించాడా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.