‘కార్తికేయ 2’ కథ ఇదే!

‘కార్తికేయ’ చిత్రానికి కొనసాగింపుగా ‘కార్తికేయ 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్‌ కథానాయకుడుగా రాబోతున్న చిత్రమిది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘కార్తికేయ’ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ అంచనాలు దష్టిలో పెట్టుకుని మరో ఆసక్తి కథను సిద్ధం చేశాడు దర్శకుడు. తాజాగా దానికి సంబంధించిన కాన్సెప్ట్‌ వీడియోను విడుదల చేశారు. 5118 ఏళ్ల కాలం గురించి చెప్పారు ఇందులో. కాల భైరవ అందించిన నేపథ్య సంగీతం ప్రధానంగా నిలుస్తుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కథానాయిక వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.