అమ్మాయిలకు స్ఫూర్తిన్నిచ్చే ‘కౌసల్య కృష్ణమూర్తి’

థానాయిక ప్రాధాన్యంతో క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. భీమనేని శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమలో హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్‌ నటిస్తోంది. ‘కణా’ అనే తమిళ్‌ సినిమాకు రీమేక్‌గా రూపుదిద్దుకుంటుందీ చిత్రం. తమిళ్‌లోనూ ఐశ్వర్యనే కథానాయిక. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉద్వేగ భరిత సన్నివేశాలతో నిండిన ఈ ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. తమిళ నటుడు శివకార్తికేయన్‌ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్‌, ఝాన్సీ, వెన్నెల కిశోర్‌ తదితరులు ప్రధాన తారాగణం. కె.ఎస్‌. రామారావు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కె.ఎ. వల్లభ నిర్మిస్తున్నారు. ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.