మన రాత మనమే రాసుకోవాలి

‘మహానటి’, ‘పెంగ్విన్‌’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత కీర్తి సురేశ్ నుంచి వస్తోన్న నాయికా ప్రాధాన్య చిత్రం ‘గుడ్‌లక్‌ సఖి’. ఈ చిత్రంలో ఆమె పల్లెటూరి పిల్లగా మాస్​ పాత్రలో నటిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను డార్లింగ్ ప్రభాస్ విడుదల చేశారు. ఇది ఆద్యంతం ఆకట్టుకుంటూ అంచనాలను పెంచుతోంది. దురదృష్టానికి దగ్గరగా ఉన్న సఖికి, కనీసం పెళ్లి జరగడం కూడా కష్టమవుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో అనుకోకుండా ప్రొఫెషనల్ షూటర్​గా ఎలా మారింది? కోచ్​గా వచ్చిన జగపతిబాబు వల్ల ఆమెకు అదృష్టం వరించిందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి.ఇందులో కీర్తి సురేశ్​తో పాటు ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. నగేశ్ కుకునూర్ దర్శకుడు. దిల్​రాజు సమర్పకుడు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.