కీర్తి ‘పెంగ్విన్’‌ టీజర్‌ చూశారా!


వైవిధ్యమైన చిత్రాల్లో కొత్తకొత్త పాత్రలతో అలరిస్తున్న నటి కీర్తి సురేష్‌. తాజాగా ఆమె నటిస్తున్న‘పెంగ్విన్’‌ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో కీర్తి సురేష్‌ తల్లి పాత్రలో అలరించనుంది. ఇప్పటికే సినిమా తెరపైకి రావాల్సింది. కరోనా వైరస్‌ కారణంగా సినిమా ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. టీజర్లో కీర్తి సురేష్‌ తన బిడ్డతో ఏవో కబుర్లు చెబుతోంది. ఆ తరువాత బిడ్డ కనిపించకపోడంతో కొన్ని పోస్టర్లను చేతబట్టుకొని అచేతనంగా కనిపిస్తోంది.

కార్తిక్‌ సుబ్బరాజ్‌ సమర్పణలో ఈశ్వర్‌ కార్తిక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. స్టోన్‌ బెంచ్‌, ప్యాషన్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాకి సంతోష్‌ నారాయణ్‌ సంగీత స్వరాలు సమకూర్చగా, అనిల్‌ క్రిష్‌ కెమెరామేన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం విడుదలైన టీజర్‌ థ్రిల్లింగ్‌కి గురిచేసేలా ఉందని సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు నెటిజన్లు పెడుతున్నారు. జూన్‌ 11న సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం జూన్‌ 19వ తేదీన ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.