ఆకాశాన్ని చీల్చుకుంటూ వస్తాడు!

సంపూర్ణేష్‌ బాబు కథానాయకుడుగా వస్తున్న చిత్రం ‘కొబ్బరి మట్ట’. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులోని పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ అందరిని అలరిస్తున్నాయి. ఈ సినిమాలో సంపూ త్రిపాత్రాభినయంలో కనిపించనున్నాడు. వీటిని ట్రైలర్‌లో చూపించడంతో అంచనాలు పెరుగుతున్నాయి. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. నీలం సాయి రాజేష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రూపక్‌ రోనాల్డ్‌సన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.