రాముడా? రావణుడా?

బాలీవుడ్‌ ప్రముఖ కథానాయకుడు సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్న చిత్రం ‘లాల్‌ కప్టాన్‌’. పౌరాణిక చిత్రంగా తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ విడుదల చేశారు. ఇందులో సైఫ్‌ ఎర్రటి బొట్టు పెట్టుకుని విభూతి రాసుకుంటూ సాధువులా కనిపిస్తాడు. ఆసక్తికరమైన ఈ లుక్‌ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ‘ప్రతి రాముడిలో ఓ రావణుడు ఉంటాడు’ అనే డైలాగ్‌ ఈ టీజర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో వినిపిస్తుండటంతో.. సైఫ్‌ రాముడా? రావణుడా? అనే ఉత్కంఠ మొదలైంది. ఎరోస్‌ ఇంటర్నేషనల్, కలర్‌ ఎల్లో ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకత్వం నవదీప్‌ సింగ్‌.

 
                         


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.