‘లీసా’ బూచి భయపెడుతుంది

‘‘చిన్నపిల్లల్ని నిద్రపుచ్చడానికి తాతయ్య, అమ్మమ్మలు రకరకాల కథలు చెబుతుంటారు. అందులో దెయ్యాల కథలూ ఉంటాయి. అలాంటి ఓ బూచమ్మ కథ ఇది. ప్రేక్షకుల్ని ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంద’’న్నారు సురేష్‌ కొండేటి. ఆయన నిర్మించిన చిత్రం ‘లీసా’. అంజలి ప్రధాన పాత్రధారి. రాజు విశ్వనాథం దర్శకుడు. ఈనెల 24న విడుదల అవుతోంది. కథానాయకుడు వెంకటేష్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘త్రీడీలో దెయ్యం సినిమాను చూసే సరికొత్త అనుభూతిని ‘లీసా’ ఇస్తుంది. సాంకేతికంగా ఉన్నతంగా తీర్చిదిద్దాం. మా సంస్థలో వచ్చిన చిత్రాలన్నీ కొత్తదనాన్ని పంచాయి. ‘లీసా’ కూడా ఆ జాబితాలో చేరుతుంది. అంజలి తన నటనతో భయపెడుతుంద’’న్నారు. సంగీతం: సంతోష్‌ దయానిధి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.