‘మహర్షి’ చేతుల మీదుగా సినీ ‘మహర్షి’ ట్రైలర్‌
ప్రపంచంతో పాటుగా మారే వాళ్లు కొంత మంది ఉంటే ప్రపంచాన్నే మార్చే వాళ్లు కొందరు ఉంటారు. అలా తెలుగు సినిమాకి ఎనలేని కృషి చేసిన వ్యక్తిగా ఎదిగి తెలుగు సినిమా పితామహుడిగా మారారు రఘుపతి వెంకయ్య నాయుడు. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘రఘుపతి వెంకయ్య నాయుడు’. నరేష్‌ టైటిల్‌ పాత్ర పోషించారు. ఈ ప్రచారచిత్రంలో వెంకయ్య పుట్టినప్పటి నుంచి చివరి రోజుల వరకు సాగే ప్రయాణాన్ని చూపించారు. ‘‘ సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమ లేఖ, సినిమా అంటే ప్రజల గుండెల్లో గీసే చిత్ర లేఖ, సినిమా నా ఆశ, సినిమా నా శ్వాస’’ అని నరేష్‌ పలికే సంభాషణలు ప్రచార చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ ప్రచార చిత్రాన్ని అగ్ర కథానాయకుడు మహేష్‌ బాబు విడుదల చేశారు.

                                 





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.