అజయ్‌ కృష్ణ రిపోర్టింగ్‌!

‘మహర్షి’ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న మహేష్‌బాబు.. ఇప్పుడు నూతనోత్సాహంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ‘ఎఫ్‌ 2’ వంటి హిట్‌ తర్వాత అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రమిది. రష్మిక కథానాయికగా నటిస్తోంది. శుక్రవారం మహేశ్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం సినిమాలోని మహేశ్‌బాబు పాత్రను పరిచయం చేసింది. ఇందులో మహేశ్‌ ఆర్మీ అధికారి మేజర్‌ అజయ్‌కృష్ణగా కనిపించనున్నారు. ‘సరిలేరు.. నీకెవ్వరూ..’ అంటూ వినిపించిన బ్యాగ్రౌండ్‌ సాంగ్‌ అభిమానులను అలరిస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకప్పటి అగ్ర కథానాయిక విజయశాంతి, నటుడు బండ్ల గణేశ్‌లు ఈ చిత్రంతోనే మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.