కాజల్‌ - విష్ణుల ‘మోసగాళ్లు’ టీజర్‌లో ట్రంప్‌

మంచు విష్ణు, కాజల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. ఐటీ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన టీజర్‌ని అల్లు అర్జున్‌ ఈరోజు విడుదల చేశారు. విడుదలైన టీజర్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తొలుత సమావేశంలో మాట్లాడుతున్న బైట్స్ కనిపిస్తున్నాయి. నాలుగొందలయాభై మిలియన్‌ డాలర్ల స్కామ్‌కు పాల్పడిన నిందితులను కనిపెట్టి త్వరలోనే పట్టుకుంటామని ట్రంప్‌ చెబుతుంటారు. ఆ తరువాత విష్ణు, కాజల్‌ ఓ పాత సామాన్లు, పేపర్లు అమ్మే స్థలంలో కనిపిస్తుంటారు. అక్కడ ఇండియాలో 2016లో రద్దైయిన కరన్సీ నోట్లు సంచుల్లో నింపి పక్కన పడేసిన విజువల్స్ కూడా ఇందులో కనిపిస్తుంటాయి. టీజర్‌ విడుదల సందర్భంగా హీరో అల్లు అర్జున్‌ స్పందిస్తూ..‘‘స్కామ్ సంగ్రహావలోకనం మోసగాళ్లులో ఉంది. నా చిన్ననాటి స్నేహితుడు, పాఠశాల సహచరుడికి శుభాకాంక్షలు. నా ప్రియమై మంచు విష్ణు కాజల్‌ అగర్వాల్‌, దర్శకుడికి చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్ అంటూ..’’తన ట్విట్టర్లో పేర్కొన్నారు. పెద్ద ఎత్తున సాంకేతిక సహాయ కుంభకోణం జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నారు. చిత్రంలో సునీల్ శెట్టి, రుహి సింగ్, నవీన్ చంద్ర, నవదీప్, కర్మ మెక్కెయిన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి సామ్ సి.ఎస్. సంగీత స్వరాలు అందిస్తున్నారు. త్వరలోనే చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదలకు సిద్ధంగా ఉంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.