ప్రచారం కోసం రాహుల్‌ను ఆడేసుకున్న నాగ్‌

‘మ
న్మథుడు’ వచ్చిన 16 ఏళ్ల తర్వాత.. మరోసారి ఆ మ్యాజిక్‌ను రిపీట్‌ చేసేందుకు ‘మన్మథుడు 2’తో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు అక్కినేని నాగార్జున. యువ దర్శక,నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తుండగా.. సమంత, కీర్తి సురేష్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల జోరు పెంచింది చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా నాగ్‌ వినూత్న రీతిలో సినిమాకు ప్రమోషన్‌ చేశారు. చిత్ర దర్శకుడు రాహుల్‌తో కలిసి ఓ ప్రాంక్ వీడియో చేసిన నాగ్‌ అతన్ని తనదైన శైలిలో కొద్దిసేపు ఆటపట్టించారు. తనకిష్టమైన ఫుడ్ ఐటెం కోసం ఓ రెస్టారెంట్ కి రాహుల్ ని పంపిన నాగ్ అక్కడ వేరే కస్టమర్ ఆర్డర్ చేసిన జ్యూస్ తాగమని, పరిచయం లేని అమ్మాయితో మాట్లాడమని, వెయిటర్ తో దురుసుగా ప్రవర్తించమని, వింత వింత పనులు చేయించాడు. కొంచెం ఇబ్బంది పడుతూనే రాహుల్ కూడా ఆ టాస్క్ లు మొత్తం పూర్తి చేశాడు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను నెట్టింట విడుదల చేయగా.. అదిప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మరింకెందుకు ఆలస్యం మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేసేయండి..
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.