వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో వస్తున్నకన్నడ చిత్రం ‘మన్నే నెంబర్ 13’. వివై కాతిరేశన్ దర్శకత్వంలో తెరకెక్కింది. హర్రర్ నేపథ్యంగా రూపొందుతున్న ఈ సినిమాని శ్రీ స్వర్ణలత ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఒకటి విడుదలై ఉత్కంఠత రేపుతోంది. ట్రైలర్లో ఏముందంటే ఐదుగురు ఐటి నిపుణులు (సాప్ట్ వేర్ ఇంజీనీర్స్) సంతోషంగా సరదాగా షికార్లు చేస్తూ గడుపుతుంటారు. ఆ తరువాత వాళ్లు ఓ రాత్రి సమయంలో కార్లో రోడ్డు ప్రయాణం చేస్తుంటారు. అనుకోకుండా ఆ కారుకి ఓ వింత ఆకారం కనిపిస్తుంది. దాంతో వాళ్లు కారు వదిలేసి బయటకు వస్తారు. ఓ కొత్త ఇంట్లోకి ప్రవేశించిన వాళ్లకు భయంకరమైన సంఘటనలు ఎదురౌతుంటాయి. విషయం తెలుసుకునే లోపు ఒకరి తరువాత ఒకరు చనిపోతుంటారు. ఇప్పుడు వారిని నిజంగా ఏదైనా వెంటాడుతుందా లేక వేరరైనా ఒక పథకం ప్రకారం బీభత్సం సృష్టిస్తున్నారో తెలియాలంటే చిత్రం తెరపైకి వచ్చే వరకు ఆగాల్సిందే. కృష్ణ చైతన్య నిర్మాతగా వ్యహరిస్తున్న సినిమాలో ఐశ్వర్య గౌడ, ప్రవీణ్ పేరం, చేతన్ గాంధర్వ, సాత్విక అప్పయ్య, రమణ తదితరులు నటించారు. చిత్రం నవంబర్ 6, 2020న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అవుతోంది.