ఆసక్తిరేకెత్తిస్తోన్న ‘మరక్కర్‌’ టీజర్‌
ప్రముఖ మలయాళ కథానాయకుడు మోహన్‌ లాల్‌ నటిస్తున్న చిత్రం ‘మరక్కార్‌’. ప్రియదర్శన్‌ దర్శకుడు. ఆశీర్వాద్‌ సినిమాస్‌ పతాకంపై నిర్మితమవుతుంది. తాజాగా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. గద్ద ఎగురుతూ కనిపించే సన్నివేశంతో ప్రారంభమయ్యే ఈ టీజర్‌ ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తోంది. మోహన్‌లాల్‌ చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం ప్రధానంగా నిలుస్తుందీ టీజర్‌కు. కేరళ ప్రాంతపు పదహారవ శతాబ్దానికి చెందిన యోధుడు కుంజాలి మరక్కర్‌ జీవితాధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రణవ్‌ మోహన్‌లాల్‌, సునీల్‌ శెట్టి, ప్రభు, మంజు వారియర్‌, సుహాసిని, కీర్తి సురేష్‌, కల్యాణి ప్రియదర్శన్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 2020 మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.