అంచనాలు పెంచుతోన్న ‘మరక్కార్‌’ ట్రైలర్‌

ప్రముఖ మలయాళ కథానాయకుడు మోహన్‌ లాల్‌ నటిస్తున్న చిత్రం ‘మరక్కార్‌’. ప్రియదర్శన్‌ దర్శకుడు. ఆశీర్వాద్‌ సినిమాస్‌ పతాకంపై నిర్మితమవుతుంది. తాజాగా టాలీవుడ్‌ ప్రముఖ కథానాయకుడు మహేష్‌ బాబు విడుదల ప్రచార చిత్రం విడుదల చేశారు. ‘దీన్ని కుంజాలీ మీకు ఇవ్వమని చెప్పారు’ అనే సంబాషణతో ప్రారంభయ్యే ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తోంది. నేపథ్య సంగీతం ప్రధానంగా నిలుస్తుంది. కేరళ ప్రాంతపు పదహారవ శతాబ్దానికి చెందిన యోధుడు కుంజాలి మరక్కర్‌ జీవితాధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రణవ్‌ మోహన్‌లాల్‌, సునీల్‌ శెట్టి, ప్రభు, మంజు వారియర్‌, సుహాసిని, కీర్తి సురేష్‌, కల్యాణి ప్రియదర్శన్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 2020 మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.