ఆ థియేటర్‌లో ఏం జరిగింది?
జె.డి. చక్రవర్తి ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘ఎంఎంఒఎఫ్‌’. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌, జె.కె. క్రియేషన్స్‌ పతాకంపై రాజశేఖర్‌, జె.డి. ఖాసీం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదలైంది. ‘నా పేరు దీపక్‌. ఒకప్పడు నా థియేటర్‌ కళ కళ లాడేదం’టూ చక్రవర్తి వాయిస్‌తో ప్రారంభమయ్యే ఈ టీజర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు ఎందుకు చనిపోతున్నారనే ప్రశ్నకు సమాధానం వెతికే వ్యక్తిగా చక్రవర్తి నటన అలరిస్తుంది. ఇంతకీ ఆ థియేటర్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

                                  


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.